క్రైమ్/లీగల్

పాస్ పుస్తకం రాలేదని... రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూన్ 25: యాదాద్రి భువన గిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామానికి చెందిన రైతు ఎర్రగోని అంజయ్య (60) తన వ్యవసాయ భూమికి రైతుబంధు పాసుపుస్తకం, పెట్టుబడి చెక్కు రాలేదని తహశీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టి నిరాశకు గురై అదే భూమివద్ద చింత చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాళ్లసింగారం శివారులో ఆదివారం రాత్రి జరిగింది. ఎర్రగోని అంజయ్య తల్లిదండ్రులు ఇచ్చిన వ్యవసాయ భూమిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో తాళ్లసింగారం శివారులోని సర్వే నెంబర్ 13లో 15.06 ఎకరాలను 30 ఏళ్ల క్రితం రైతు గంట్ల బుచ్చిరెడ్డి నుంచి కొనుగోలు చేశారు. అప్పుడే రైతు నుంచి కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోని కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఇటీవల ప్రభుత్వం డిజిటల్ పాసుపుస్తకాలకు శ్రీకారం చుట్టి రైతుబంధు పేరు తో పెట్టుబడి చెక్కులు ఇస్తోంది. ఈ భూమి వక్ఫ్ బోర్డులో ఉండడంతో పాస్‌పుస్తకంతో పాటు పెట్టుబడి చెక్కు రాలేదు. దీంతో నిరాశకు గురైన అంజయ్య తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేశా రు. తెలిసినవారిని తీసుకువెళ్లి ప్రాధేయపడ్డారు. అధికారులు ససేమిరా అనడంతో ఎటూపాలు పోలేదు. రైతుబంధు చెక్కు, పట్టాదారు పాసుపుస్తకం రాదని మనస్తాపానికి గురైన రైతు అంజయ్య వ్యవసాయ బావి వద్దనే ఉన్న చింత చెట్టుకు ఆదివారం రాత్రి ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి పది వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్యాపిల్లలు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతు కన్పించాడు. వెంటనే స్థానికుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత తహశీల్దార్ రైతుబంధు చెక్కు, పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడం వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అతను వచ్చే వరకు శవాన్ని పోస్టుమార్టంకు తీసుకుపోనివ్వమని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న తహశీల్దార్ షేక్‌అహ్మద్‌ను గ్రామస్థులు నిలదీశారు. రైతు వ్యవసాయ భూమిపై పాస్‌పుస్తకం పంపిణీ విషయంలో ప్రభుత్వ నిషేధం ఉందని, అందుకే ఇవ్వడం సాధ్యం కాలేదని తేల్చి చెప్పారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకోని సీఐ వెంకటయ్య దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం..ఆత్మహత్య చేసుకున్న అంజయ్య