క్రైమ్/లీగల్

కిడ్నీ దానానికి అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: రాజు కుకునూరు అనే వ్యిక్తి తన కిడ్నీని రత్నాకర్ పెద్దాడ అనే మరొక వ్యక్తికి దానం ఇచ్చేందుకు హైకోర్టు గురువారం అనుమతించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ. రాజశేఖరరెడ్డి ఈ మేరకు తీర్పు చెప్పారు. రత్నాకర్ పెద్దాడ వద్ద రాజు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రత్నాకర్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయనను కాపాడేందుకు రాజు తన రెండు కిడ్నీలలో ఒక కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ అనుమతి అవసరం ఉంటుంది. రాజు తన కిడ్నీని రత్నాకర్‌కు దానం చేసేందుకు రాష్ట్ర ఆథరైజేషన్ కమిటీ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనుమతి ఇవ్వలేదు. దాంతో రత్నాకర్ కోర్టుకు వెళ్లగా, రత్నాకర్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి తీర్పు చెబుతూ, రాజు తన కిడ్నీని రత్నాకర్‌కు దానం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.