క్రైమ్/లీగల్

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో భారీగా గంజాయి, ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జూలై 7: ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో గత కొంతకాలం నుంచి ఎర్రచందనం అత్యధికంగా చెన్నైకు స్మగ్లింగ్ చేస్తున్న నేపథ్యంలో అక్రమ రవాణాను నివారించేందుకు అటు తమిళనాడు, ఇటు ఆంధ్ర పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కాంచీపురం, తిరువళ్లూరు జిల్లా యాంటీ డ్రగ్స్ ఫోర్స్ డీఎస్పీ జూరియట్ ఫీజర్ బృందం శనివారం ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు గ్రామమైన పన్నంగాడు యళావూరు సమీపంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన మోడరన్ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర నుంచి ఆర్టీసీ బస్సులో 32కిలోల గంజాయిని ఇద్దరు భార్యభర్తలు తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం పోలీసులకు అందటంతో ఆర్టీసీ బస్సును తనిఖీ చేసి ఖమ్మంజిల్లా ఉత్తమపాళెంకు చెందిన భర్త అయ్యర్, భార్య భారతీలనుఐ, మరొక ఆర్టీసీ బస్సులో తమిళనాడు ప్రాంతం దిండిగల్‌కు చెందిన మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారినుంచి 32కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఇదే సమయంలో నెల్లూరు నుంచి కారులో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఆరంబాకం పోలీసులకు సమాచారం అందటంతో సదరు కారును ఆరంబాకం పోలీసులు వెంబడించారు. ఇది గమనించి కారులోని దుండగులు వేగంగా పారిపోతుండగా ఆరంబాకం పోలీసులు తమిళనాడు యాంటీ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. ప్రత్యేక బృందం పోలీసులు కారును, అందులో ఉన్న శ్రీకాళహస్తికి చెందిన డ్రైవర్ సురేష్‌బాబు, నెల్లూరుకు చెందిన బాలచంద్రయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా కారులో 350కిలోల బరువుతో ఉన్న 30 ఎర్రచందనం దుంగలను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పట్టుకున్న గంజాయి, ఎర్రచందనం విలువ సుమారు 10లక్షల రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ శ్రీ్ధర్ తెలిపారు.