క్రైమ్/లీగల్

కొడుకు కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 7: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడుకును చూసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన హృదయ విదారకరమైన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నాగోల్ గిద్ద మండలం ఎర్రబోగడ గ్రామానికి చెందిన జాదవ్ అంబర్ సింగ్ నాలుగు సంవత్సరాల క్రితం ఐడీఏ బొలారానికి కుటుంబ సమేతంగా జీవనోపాధి నిమత్తం వలస వచ్చాడు. అంబర్ సింగ్ ఐడీఏ బొలారంలోని ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తుండగా అతని భార్య జాదవ్ సునీత(30) క్యాంటీన్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్నది. వీరి కుమారుడు రాణాప్రతాప్(10) ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మండలంలోని ఘణపూర్ గ్రామంలోని మెడిసిటీ ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రితం చికిత్స నిమిత్తం చేర్పించారు. శనివారం తెల్లవారు ఝామున తల్లి సునీత చికిత్స పొందుతున్న కొడుకును పరామర్శించేందుకు ఆమె పనిచేసే క్యాంటీన్ యాజమాని భగవత్ ప్రసాద్‌తో కలిసి బైక్ (టీఎస్ 15ఈసీ1230)పై ఐడీఏ బొలారం నుంచి మెడిసిటీ ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యంలో కండ్లకోయ గ్రామ పరిధిలోని గుబ్బాశీతల గిడ్డంగి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ(ఏపీ16సీ3559) వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. సునీత బైక్‌పై నుంచి పడగా ఆమె తలపై నుంచి లారీ చక్రం వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.