క్రైమ్/లీగల్

పథకం ప్రకారమే హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూలై 7: మండల కేంద్రంలోని పాత ఉట్నూరులో ఇటీవల జరిగిన హత్య ఉదాంతం పథకం ప్రకారమే జరిగిందని డిఎస్పీ వెంకటేష్ తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పాత ఉట్నూరుకు చెందిన అనిల్ కుమార్ (28)ను అతని బావ టేకుల గంగాధర్ కర్రతో తలపై కొట్టి హత్య చేశాడని డి ఎస్పీ తెలిపారు. మృతి చెందిన అనిల్ గతంలో గుడిహత్నూర్‌కు చెందిన రాణి యువతితో ప్రేమవివాహం చేసుకొని గత కొన్ని రోజులుగా ఉట్నూరులో నివాసం ఉండేవాడని అన్నారు. భార్యభర్తల మద్య విబేధాలు తలెత్తడంతో భార్య రాణి తల్లిగారింటికి వెళ్ళిపోగా అనిల్ పాత ఉట్నూరులో ఉన్న తన చెల్లెలు గంగాదేవి, బావ గంగాధర్‌ల వద్ద ఉంటున్నాడని అన్నారు. అయితే చెల్లె బావల మద్య తరచుగా గొడవలు జరుగుతుండడంతో బావ గంగాధర్‌ను అనిల్ పలుమార్లు నిలదీశాడని, దీంతో తనవద్దే ఉంటూ తననే ఎదిరిస్తారా అన్న భావనతో అనిల్‌పై పగను పెంచుకున్న గంగాధర్ పథకం ప్రకారం ఈనెల 4వ తేదీన సాయంత్రం మద్యం సేవించి తన ఇంటి వద్ద కర్రతో అనిల్ తలపై కొట్టాడని అన్నారు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ లాభం లేకుండాపోయిందన్నారు. పథకం ప్రకారం అనిల్‌ను హత్యచేసిన గంగాధర్‌పై హత్యకేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో సి ఐ వినోద్, ఎస్సై నరేష్ కుమార్‌లు ఉన్నారు.