క్రైమ్/లీగల్

నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపీడీయత్న కేసును ఛేదించిన రైల్వే పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూలై 7: నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకుని నుండి 31లక్షల రూపాయల నగదు బ్యాగ్‌ను దోపీడీ చేసేందుకు యత్నించి జిఆర్‌పి పోలీసుల నుండి తప్పించుకు పోయిన నిందితులను అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్పీ కేవీ మోహన్‌రావు తెలిపారు. శనివారం తెనాలి జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 2018 ఫిబ్రవరి 19న విజయవాడ నుండి బయలుదేరిన నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారు కొట్టు గుమస్తా వేముల వెంకటేష్ ప్రయాణిస్తున్న సమయంలో రైలు తెనాలి 3వ నెంబరు ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుంటున్న సమయంలో వెనుకనుండి గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు వెంకటేష్ చేతిలోని బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేయగా అతడూ స్టేషన్‌పైకి దిగి కేకలు వేయటంతో గమనించిన స్థానిక జీఆర్‌పీ పోలీసులు ప్లాట్‌పారమ్ వద్దకు రావటంతో గమనించిన దొంగలు 31లక్షల రూపాయలున్న సంచిని ముళ్ళపొదల్లోవేసి పారిపోయినట్లు తెలిపారు. ఈసంఘటనపై కేసు నమోదుచేసిన తెనాలి రైల్వే పోలీసులు విచారణ చేపట్టగా విజయవాడకు చెందిన ఎస్‌పీ జ్యూవెలర్స్‌లో గుమస్తాగా పనిచేస్తున్న కాంచూరి ధనుంజయ అనే వ్యక్తి దుకాణం వద్దనుండి అదే షాపులో గుమస్తాగా పనిచేస్తున్న వేముల వెంకటేష్ బంగారం కొనేందుక చెన్నై వెళుతున్నాడని తెలిసి వాటిని ఎలాగైనా దోపీడీ చేయాలని ప్లాన్‌వేసి విజయవాడలోని మాచవరం, గుణదల ప్రాంతాలకు చెందిన గడ్డం సాయి దుర్గాప్రసాద్ అలియాస్ బ్లేడ్‌సాయి, గన్నవరపు ప్రశాంత్‌కుమార్, చల్లా కళ్యాణ్, కటారి మహేశ్వరరావు అలియాస్ మహేష్, కారే అజయ్‌బాబులతో కలసి పథకం ప్రకారం ఈ దొంగతనానికి పాల్పడినట్లు వివరించారు. ఈమేరకు నిందితులను శనివారం అరెస్టుచేసి వారి నుండి స్వాధీనం చేసుకున్న 31లక్షల రూపాయలను దుకాణం యజమానికి అప్పగించినట్లు ఎస్పీ వివరించారు. ఈసందర్భంగా కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు.