క్రైమ్/లీగల్

ఇద్దరు బైకు దొంగల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, జూలై 7: అర్బన్ పోలీసులు మోటారు సైకిళ్ల దొంగలు ఎస్‌కె కరిముల్లా అలియాస్ తుకుడి, గుడిపాటి గోపీచంద్ అలియా స్ గోపిలను శనివారం అరెస్ట్ చేసి, వారి నుండి చోరీ చేసిన 8 లక్షల విలువైన 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల డిఎస్‌పి గంగాధరన్ కథనం మేరకు... పొన్నూరు పట్టణానికి చెందిన టీచర్ సుధాకర్‌కు చెందిన బుల్లెట్ ఈనెల 3వ తేదీన చోరీకి గురైంది. బాధితుడు సుధాకర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అర్బన్ పోలీసులు శనివారం ఉదయం దొప్పలపూడి క్రాస్‌రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా మోటారు సైకిల్‌పై వస్తున్న కరిముల్లా, గోపిలను అనుమానించి, అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనానికి సరైన రికార్డులు లేకపోవడాన్ని గమనించారు. ఆ బైకు దొంగిలించిందేనని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు పాత నేరస్థులేనని తేలింది. వారు బాపట్లలో 7, తెనాలిలో 2, పొన్నూరు, కర్లపాలెం, చందోలు, భట్టిప్రోలు, గుం టూరులలో ఒక్కొక్క బైకును చోరీ చేసినట్లు అంగీకరించారు. చోరీకి గురై పట్టణంలోని పివిసి కాలనీకి ఆనుకుని ఉన్న పొదల్లో దాచి ఉంచిన బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైకు దొంగల అరెస్ట్‌కు కృషి చేసిన సిఐ ఎం నాగేశ్వరరావు, ఎస్‌ఐ డి కిషోర్‌బాబు, ఎఎస్‌ఐ ఆంజనేయులు, పోలీసులు నరేష్, రమేష్, రాంబాబులను డిఎస్‌పి గంగాధరన్ అభినందించారు. వారికి రివార్డులు కూడా ప్రకటించారు.