క్రైమ్/లీగల్

స్పెషల్ డ్రైవ్‌లో 7,619 కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, జూలై 8: రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించి వాహనాలను నడుపుతున్న వాహనదారులపై గత వారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 7,619 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో గత వారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణంకంటే ప్రాణాలు ముఖ్యమని ..రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రాణాలు సురక్షితమన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వాహనదారులు ఉపయోగించాలన్నారు. అతివేగం పనికిరాదన్నారు. పరిమితికి ప్రయాణించే వాహనాల్లో ప్రయాణించరాదన్నారు. విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు పంపేటప్పుడు వారి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి వెళ్లే విద్యాసంస్థల వాహనాలుపై తమ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం పెనుప్రమాదం అన్నారు. వీలైనంత వరకు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పంచ సూత్రాలు అమలుచేయటం జరుగుతుందన్నారు. గత వారంలో జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 7,311 మంది వాహనచోదకులకు ఆయా పోలీసులు కౌనె్సలింగ్ చేయటం జరిగిందన్నారు. మొత్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 7,619 మందిపై కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు.