క్రైమ్/లీగల్

లారీ కిందపడి తమిళనాడు హెడ్‌కానిస్టేబుల్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జూలై 8: తడ బజారు కూడలిలో డివైడర్‌పై నడిచివస్తూ ప్రమాదవశాత్తు లారీ కిందపడి తమిళనాడు ప్రాంతంలోని తిరువళ్లూరులో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నేతాజి (45) అనే వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల సమాచారం మేరకు, తమిళనాడు ప్రాంతం గుమ్మిడిపూడి తాలుకా ఎలావూరుతేరాపాలెంకు చెందిన నేతాజి తడలోని తమ బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో డివైడర్‌పై నడిచివస్తూ ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆ మార్గంలో వెళ్తున్న లారీ కిందపడి మృతిచెందాడు. నేతాజి తిరువళ్లూరులోని హోంగార్డు హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. తడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.