క్రైమ్/లీగల్

వాడరేవులో ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, జూలై 8: వాడరేవు తీరానికి వచ్చిన ముగ్గురు స్నేహితుల విహారం విషాదంతో ముగిసింది. తోటి స్నేహితుడు నీళ్లలో మునిగి పోతుండడంతో అతనిని రక్షించాలంటూ కేకలు వేసినా ప్రయోజనం కరువైంది. అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితుడు కళ్లముందే సముద్రంలో కొట్టుకుపోతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. గల్లంతైన యువకుడి స్నేహితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన రైతు మామిళ్లపల్లి సింగయ్య కొడుకు హరిప్రసాదు గుంటూరు జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజి హాస్టల్లో ఉన్న అతనికి స్నేహితులు విక్రమ్, సూర్య ఫోన్ చేసి చీరాల వాడరేవుకు వెళదామని పిలిచారు. ముగ్గురు కలిసి మధ్యాహ్నం సముద్ర తీరానికి చేరుకున్నారు. కొంతసేపు సముద్రంలో స్నానం చేసి భోజనం చేశారు. వాతావరణం ఆహ్లాదంగా ఉండడంతో మళ్లీ సముద్రంలోకి వెళ్లేందుకు హరిప్రసాదు ఉపక్రమించాడు.అయితే అప్పటికే సాయంత్రం నాలుగుగంటలు కావస్తుండడంతో అలల ఉద్ధృతి పెరిగింది. మిగిలిన ఇద్దరు స్నేహితులు అతనితో జత కూడే సమయానికే అల అతన్ని వెనుకనుంచి బలంగా తాకింది. దీంతో అదుపుతప్పి హరిప్రసాదు నీళ్లలో పడి మునిగిపోయాడు. అతని చేతులు మాత్రమే గమనించిన స్నేహితులు రక్షించాలంటూ కేకలు వేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న మత్స్యకారులు స్పందించి చూసేసరికే హరిప్రసాదు సముద్రంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భక్తవత్సలరెడ్డి, ఈపూరుపాలెం ఎస్సై అనూక్ సిబ్బందితో అక్కడకు చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలించారు. యువకుడు వివరాలు సేకరించి తల్లిదండ్రులకు తెలిపారు. యువకుడి తండ్రి సింగయ్య వాడరేవు చేరుకుని విషాదంలో మునిగిపోయాడు. కడపటి వార్తలందే వరకు అతని అచూకీ తెలియరాలేదు.