క్రైమ్/లీగల్

ఏం చర్యలు తీసుకున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సంఘంలో కోరలు చాచి చిన్నపిల్లలపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్న డ్రగ్ భూతాన్ని తరిమివేయడానికి తాము గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. చిన్నపిల్లలకు డ్రగ్స్ వల్ల కలుగుతున్న నష్టాలను పేర్కొంటూ 2016లో నోబుల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి వేసిన పిల్‌పై స్పందించిన సుప్రీం కోర్టు ఈ విషయంలో కేంద్రం ఆరునెలల్లో జాతీయ స్థాయిలో ఒక ప్రణాళికను రూపొందించాలని, దీనివల్ల కలుగుతున్న నష్టం, ప్రమాదాన్ని నిర్ధారించడానికి జాతీయ స్థాయిలో ఒక సర్వే నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం ఆదేశాలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని సత్యార్థి వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్‌లు ఎఎం కన్వీల్‌కలర్, డివై చంద్రచూడ్‌ల ధర్మాసనం విచారించింది. సత్యార్థి తరఫున వాదించిన హెచ్‌ఎస్ ఫూల్కా మాట్లాడతూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ వల్ల చిన్నారులకు, ఇతరులకు జరుగుతున్న నష్టాలపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం, రాష్ట్రాలు విఫలమయ్యాయని అన్నారు. ఈ విషయంలో సుప్రీం జోక్యం చేసుకుని స్కూల్ పాఠ్యాంశాల్లో సైతం డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలపై పిల్లలను చైతన్యవంతం చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ఒక్క రాజధాని ఢిల్లీలోని సుమారు లక్ష మంది వీధి పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీరిలో పలువురు డ్రగ్స్ బారిన పడుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. దీనిపై పూర్తి వివరాలతోనివేదిక సమర్పించాలని ఏఎస్‌జి పింకీ ఆనంద్‌ను ఆదేశిస్తూ కేసును ఆగస్టు 20కి వాయిదా వేశారు.