క్రైమ్/లీగల్

విద్యార్థినిని నమ్మించి మోసగించిన నయవంచకునిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, జులై 8: ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని నమ్మబలికాడు. తన కామదాహం తీర్చుకున్నాడు. వంచనకు గురైన యువతి గర్భవతి అయ్యాక పెళ్లి చేసుకోమంటే తను ఏ పాపమూ ఎరుగనని బుకాయించిన నయవంచకునిపై గుంటూరు జిల్లా తాడికొండ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం తాడికొండకు చెందిన ఓ విద్యార్థిని సత్తెనపల్లి సమీపంలోని కళాశాలలో చదువుతోంది. ఉండవల్లి సాంబయ్య అనే వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. ఆమెను లొంగదీసుకొని కామవాంఛ తీర్చుకున్నాడు. విద్యార్థిని గర్భం దాల్చటంతో గర్భస్రావానికి మందులు వేశాడు. మందులు మింగిన విద్యార్థిని తీవ్ర రక్తస్రావానికి గురికావటంతో హుటాహుటిన 108 వాహనం ద్వారా శుక్రవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చిందని చెప్పడంతో తల్లిదండ్రులు నిశే్చష్టులయ్యారు. జరిగిన విషయంపై ఆమె తల్లిదండ్రులు ఆదివారం సాంబయ్యను నిలదీయగా తాను ఏ పాపం ఎరుగనని, ఎంతటి విచారణకైనా సిద్ధమని బుకాయించాడు. ఆదివారం విద్యార్థిని స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో సాంబయ్యపై కేసు నమోదు చేశారు. విద్యార్థినికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. కేసు విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు.