క్రైమ్/లీగల్

కూతురిని రక్షించబోయి తల్లీ, మరో కూతురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీడికాడ: ప్రమాదవశాత్తూ నెలబావిలోపడిన కూతురుని రక్షించబోయి తల్లి మరో కూతురు మృత్యవాత పడ్డ సంఘటన శనివారం రాత్రి విశాఖపట్నం జిల్లా, చీడికాడ మండలంలోని చుక్కపల్లి గ్రామంలో సంభవించింది. చుక్కపల్లికి చెందిన చామంతుల భవాని(40) శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలైన జయంతి(12), వరలక్ష్మి(8)తో పొలంలోకి వెళ్ళింది. అయితే, పనులు ముగించుకొని ఇంటికి వచ్చే సమయంలో వరలక్ష్మి మంచినీటి కోసం సమీపంలో ఉన్న నెల బావి వద్దకు వెళ్ళింది. ప్రమాదవశాత్తూ వరలక్ష్మి నెలబావిలోపడి కేకలు వేయడంతో భవానితోపాటు జయంతి కూడా వరలక్ష్మిని రక్షించడానికి ప్రయత్నించి మొత్తం ముగ్గురు మృత్యవాత పడ్డారు. రాత్రి ఏడున్నర గంటలైనా భవాని, పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆమె తమ్ముడు పాకవద్దకు వెళ్లాడు. పాకవద్ద లేకపోవడంతో సమీపంలో ఉన్న బావి వద్ద గడ్డిమోపు, కొడవలి, భవాని చెప్పులు కనిపించడంతో ఆయన హుటాహుటున గ్రామంలోకి వెళ్లి సమాచారం అందజేశాడు. గ్రామస్తులు పరుగున వచ్చి బావిలోపడి ఉన్న భవాని, పిల్లల మృత దేహాలను గజ ఈతగాళ్ళ సాయంతో బయటకు తీయించారు. సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సురేష్‌కుమారు సంఘటనాస్థలానికి చెరుకొని కుటుంబ సభ్యులను విచారించి కేసు నమోదు చేశారు.
కాగా, భవానీ భర్త శ్రీను ఏడాది కిందటే కిడ్నీ వ్యాధితో మృతి చెందాడు.