క్రైమ్/లీగల్

మేధా పట్కర్‌పై పరువు నష్టం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమ నాయకురాలు మేధా పట్కర్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ వీకే సక్సేనా ఆమెపై చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదైంది. 2006లో మేధా పట్కర్ తనపై అన్యాయంగా ఆరోపణలు చేసినట్టు ఒక టీవీ చానెల్‌లో ప్రసారం కావడంతో తన పరువుకు భంగం కలగడంతో బాధితుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలు రుజువైన పక్షంలో 499/500 (పరువునష్టం) సెక్షన్ల కింద మేధా పట్కర్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా వచ్చిన ప్రకటనలపై మేధా పట్కర్ సైతం కోర్టును ఆశ్రయించి కేసు వేశారు. సక్సేనా గుజరాత్ సర్దార్ సరోవర్ నిగమ్ చెందిన కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందుకున్నారని మేధా పట్కర్ ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, కావాలనే ఆమె అసత్యాలను ప్రచారం చేస్తోందని సక్సేనా కోర్టుకు నివేదించారు. 2000 సంవత్సరం నుండి న్యాయపరంగా మేధా పట్కర్, సక్సేనా పోరాడుతున్నారు. తనకు వ్యతిరేకంగా, తన పరువుకు భంగం కలిగేలా ఆమె టీవీ చానెల్‌లో ఆరోపణలు చేసిందని సక్సేనా వాదిస్తున్నారు.