క్రైమ్/లీగల్

కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, జూలై 10: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు వెళ్తున్న కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీ జరిగింది. ఓ ప్రయాణికురాలి నుంచి మూడు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. పామిడి-రామరాజుపల్లి స్టేషన్ల మధ్య దుండగులు కేబుల్ వైరును కత్తిరించడంతో రైలు నిలిచిపోయింది. అక్కడే కాపుకాసిన దుండగులు ఎస్-7 కోచ్‌లో ఉన్న ప్రయాణికురాలు రేణుక మెడలోని మూడున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. చోరీ గురించి ఆమె రైలులో ఉన్న టీసీ దృష్టికి తీసుకువచ్చింది. అనంతరం బెంగళూరులోని జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఉదయం రైల్వే అధికారులు, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కత్తిరించిన వైర్లను పరిశీలించారు.