క్రైమ్/లీగల్

కంప్రెషర్ బోల్తా: ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల, ఫిబ్రవరి 20: మారుమూల ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా ఉన్న రాళ్లను తొలగించే యంత్రం బోల్తాపడిన ఘటనలో అనకాపల్లి మండలం దర్జీనగర్ గ్రామానికి చెందిన నారాయణ(45) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే భీరం పంచాయితీ వంజర్భ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకోగా భీరం నుంచి గడ్డిబందలు వరకూ రోడ్డు పనులు చేయిస్తున్నారు. ఈ రహదారి మద్యలో ఉన్న బండరాళ్లను తొలగించేందుకు వినియోగిస్తున్న కంప్రెషర్ మంగళవారం వంజర్భ గ్రామం నుంచి గడ్డి బందల గ్రామానికి వెళ్ళేందుకు సిద్దమై సుమారు 20 మీటర్ల దూరం వెళ్ళగానే వాహనం వెనువెనకాల వచ్చి పెద్దగాతలో పడిపోయింది. బండి భాగాలు డ్రైవర్ నారాయణ చాతిపై బలంగా అదిమిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై ఎటువంటి పిర్యాదు అందలేదని ఎస్.ఐ. శ్రీను తెలిపారు.