క్రైమ్/లీగల్

ఢిల్లీ ప్రభుత్వ అప్పీల్‌పై వచ్చే వారం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేవంటూ తీర్పు ఇచ్చినా, సరిగా అమలు కావడం లేదంటూ ఢిల్లీప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను వచ్చే వారం విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మివ్రా, జస్టిస్ ఏఎం ఖాన్వికర్, జస్టిస్ డవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ విధి విధానాలపై విస్పష్టంగా తీర్పు ఇచ్చినా పాత పరిస్థితే కొనసాగుతోందంటూ ఢిల్లీప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను వచ్చే వారం విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఇటీవల ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం లెఫ్టినెంట్ గవర్నర్ మంత్రివర్గం చేసిన సిఫార్సులకు అనుగుణంగా నడుచుకోవాలని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోరాదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే సుప్రీం అని తీర్పు ఇచ్చింది. మంగళవారం ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన తీర్పుపై కోర్టు స్పందిస్తూ, వచ్చే వారానికి ఈ కేసును లిస్టింగ్ చేస్తున్నామని పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు విశేషాధికారాలు ఏమీ ఉండవంటూ ఈ నెల 4వ తేదీన సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.