క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 10: ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకున్న ఓర్వకల్లు ఎంపీడీఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రజాక్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఎన్.కొంతలపాడు గ్రామానికి చెందిన పి.తిరుమలేష్ తన భార్య పేర రుణం కోసం ఎస్సీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపేందుకు ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రజాక్ రూ. 20 వేలు లంచం అడిగాడు. అయితే అంత ఇచ్చుకోలేనని తిరుమలేష్ చెప్పడంతో రూ. 10 వేలకు బేరం కుదిరింది. దీంతో తిరుమలేష్ కర్నూలులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం సీనియర్ అసిస్టెంట్ రజాక్‌కు రూ. 10 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డిఎస్పీ జయరామరాజు అరెస్టుచేశారు.