క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన సమాచార శాఖ ఇఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 13: చిత్తూరు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆడియో వీడియో ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఈఈ నాగేశ్వరరావు ఏసీబీకి చిక్కారు. కార్యాలయంలోనే 8వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం వల పన్ని పట్టుకొన్నారు. చిత్తూరు జిల్లాలో గ్రామాలకు పలు వౌలిక వసతులు కల్పించే లెవన్ స్టార్ కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ అభివృద్ధి పనులను వీడియో ద్వారా చిత్రీకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ వీడియో చిత్రీకరణ పనులను పూతలపట్టు మండలం కమ్మతిమ్మపల్లికి చెందిన ప్రవీణ్ అనే యువకునికి కాంట్రాక్టు అప్పగించారు. తనకు అప్పగించిన పనులను వీడియోలో చిత్రీకరించి సమాచార శాఖ ఆడియో వీడియో ఇంజినీరింగ్ విభాగం డిప్యూటీ ఈ ఈ నాగేశ్వర రావుకు బిల్లు చెల్లించమని కోరగా బిల్లు చెల్లించడానికి 8వేలు లంచం అడిగాడు. దీంతో ఆ యువకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ప్రవీణ్ సమాచారం శాఖ ఈఈకి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.