క్రైమ్/లీగల్

నానక్‌రాంగూడలో భారీ పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జూలై 13: నానక్‌రాంగూడలో జరిగిన భారీ పేలుళ్లతో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుళ్లతో స్థానిక ప్రజలు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. ఈ భారీ పేలుళ్లకు చుట్టుపక్కల అపార్ట్‌మెంట్స్‌కు పగుళ్లు ఏర్పడగా, మరికొన్ని అపార్ట్‌మెంట్స్ అద్దాలు పగిలి, లోపల ఉన్నవారికి కూడా గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ మండల డీసీపీ ఎం.వెంకటేశ్వర్‌రావు కథనం ప్రకారం...నానక్‌రాంగూడ ప్రాంతంలోని ఫొనెక్స్ భవనంవద్ద కొంత కాలంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే బండరాళ్లను పగులగొట్టేందుకు జిలెటిన్‌స్టిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నాలుగు జిలెటెన్‌స్టిక్స్‌ను పెట్టారు. అవి ఒకేసారి పేలడంతో, భారీ పేలుళ్లతో శబ్దం చేస్తూ పెద్ద పెద్ద బండరాళ్లు ఎగిరి పడ్డాయి. అక్కడే ఉన్న జేసీబి డ్రైవర్ రమేష్‌తో పాటు సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సురేష్‌పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం వచ్చేంతవరకు ఎవ్వరినీ అనుమతించేది లేదని పేర్కొన్నారు. స్థానికంగా పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్స్‌లో కూడా రాళ్లు పడటంతో అందులో ఉన్న వారికి కూడా గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా పలు భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పక్కనే ఉన్న భవన లిఫ్ట్‌కూడా ధ్వంసమైంది. పేలుళ్లకు అనుమతులు లేవని, వారిపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జిలెటెన్‌స్టిక్స్ ఎవ్వరూ వాడకుండా తగు చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.
అయితే ఇంకా ఎంతమంది మృతిచెందారో ఖచ్చితంగా తెలుపలేమని స్థానికులు పేర్కొంటున్నారు.