క్రైమ్/లీగల్

176 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 13: నిజామాబాద్ జిల్లా కేంద్రంగా గంజా యి అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. అటు పోలీసులు, ఇటు ఆబ్కారీ శాఖ అధికారులు ఇటీవలి కాలంలో తరుచూ దాడులు నిర్వహిస్తూ నిల్వలను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ, గంజాయి స్మగ్లింగ్ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా మహారాష్టక్రు అక్రమ రవా ణా చేస్తున్న ఎండు గంజాయి నిల్వలను స్థానిక వన్‌టౌన్ పోలీసులు మరోమారు భారీ మొత్తంలో స్వాధీ నం చేసుకున్నారు. శుక్రవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసి న విలేఖరుల సమావేశంలో సీ.పీ కార్తికేయ వివరాలు వెల్లడించారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ద్వారా మహారాష్టల్రోని ముంబైకు గంజాయిని తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు వన్‌టౌన్ పోలీసులు రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న ట్రావెల్ పాయింట్ వద్ద నిఘా పెట్టారని సీ.పీ తెలిపారు. ఈ క్రమంలోనే బస్సు అక్కడికి రాగానే, డిచ్‌పల్లి మండలం అమృతాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దేవానగర్ క్యాంపునకు చెందిన దంపతులు గువ్వల దేవయ్య, గువ్వల శారదలు మూడు బ్యాగులతో ముంబై బస్సు ఎక్కారని అన్నారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు బ్యాగులను తనిఖీ చేయగా, అందు లో ప్యాకింగ్ చేసిన 26కిలోల ఎండు గంజాయి లభ్యమైందన్నారు. దీంతో వీరిరువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపగా, దేవానగర్ క్యాంపునకు చెందిన సుదర్శన్ అనే వ్యక్తి గంజాయి రవాణాలో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్టు వెల్లడించారన్నారు. పట్టుబడ్డ నిందితులకు సుదర్శన్ సమీప బంధువు అవుతాడని, అతను అందించే గంజాయి నిల్వలను ముంబైకు చేరవేస్తే కమీషన్ ముట్టజెప్పేవాడని అన్నారు. దేవయ్య, శారదలు విచారణలో వెల్లడించిన సమాచారంతో దేవానగర్ క్యాంపులోని సుదర్శన్ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేయగా, మంచం కింద దాడి ఉంచిన మరో 150 కిలోల ఎండు గంజాయి నిల్వలు లభ్యమయ్యాయని తెలిపారు. పట్టుబడ్డ గంజా యి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. లక్షల్లో ఉంటుందన్నారు. ఇతర ప్రాంతాల నుండి గుట్టుగా గంజాయిని సుదర్శన్ ఇక్కడికి తెప్పించుకుని తన ఇంట్లోనే నిలువ చేసేవాడని, వీలును బట్టి కమీషన్ పద్ధతిపై ఇతరుల ద్వారా ముంబైకు రవాణా చేయించేవాడని చెప్పారు. అతని ఇంటిపై దాడి చేసిన సందర్భంగా గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్న ఆటోరిక్షాను కూడా స్వాధీనం చేసుకున్నామని, అయితే, సుదర్శన్ మాత్రం పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని సీ.పీ తెలిపారు.
పక్కా సమాచారంతో పకడ్బందీగా దాడి జరిపి భారీగా గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకున్న సీఐ నాగేశ్వర్‌రావు, వన్‌టౌన్ ఎస్‌ఐ బీ.వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బందిని సీ.పీ అభినందిస్తూ వారికి రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ ఎం.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..పట్టుబడ్డ గంజాయి స్మగ్లర్ల వివరాలను వెల్లడిస్తున్న సీపీ కార్తికేయ