క్రైమ్/లీగల్

కూరగాయల ముసుగులో గంజాయి విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కేపీహెచ్‌బీకాలనీ, జూలై 15 : సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ కూరగాయల విక్రయం ముసుగులో అధిక సంపాదనకు ఆశపడి గంజాయి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం ఎన్కతల గ్రామానికి చెందిన పాండురంగాచారి (19), చిల్కపల్లి కమల్‌నాధ్‌రెడ్డి (21) చదువుకుంటూనే తల్లిదండ్రులు పండించిన కూరగాయలను నగరానికి తీసుకు వచ్చి విక్రయిస్తుంటారు. సాయిరాం, వినిత్‌కుమార్ అనే ఇద్దరు విద్యార్ధులు వీరి నుంచి గంజాయి కొనుగోలు చేస్తుండగా శనివారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. కేపీహెచ్‌బీ అదనపు సీఐ గోపినాథ్ నేతృత్వంలో విద్యార్థులను విచారించారు. మొమ్మిడాల మండలం దేవరాంపల్లి తండాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు ఇద్దరు విద్యార్థులు అంగీకరించారు. వారి నుంచి 400 గ్రాముల గంజాయిని, రెండు సెల్ ఫోన్లను, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొనుగోలు చేసిన గంజాయి తక్కువ మోతాదులో ఉండడంతో కొనుగోలు చేసిన ఇద్దరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.