క్రైమ్/లీగల్

కేకేడబ్ల్యూ కార్యదర్శి కొరియర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, జూలై 15: సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఖమ్మం, కరీంనగర్, వరంగల్ (కేకేడబ్ల్యూ) జిల్లాల కార్యదర్శి దామోదర్‌కు కొరియర్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా సివిల్ లిబర్టీ కమిటీ కార్యదర్శి రమేష్ చం దర్‌ను శనివారం సాయంత్రం హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి 5లక్షల నగదు, విప్లవ సాహిత్యం, రెండు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన దామోదర్ కొరియర్ వివరాలను క్రైం డీసీపీ, ఓఎస్డీ బిల్లా అశోక్ కుమార్ వెల్లడించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన పెంట రమేష్ ప్రస్తుతం భీమారంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం ఏడుగంటలకు కొరియర్ రమేష్ చందర్, సానుభూతి పరుడు జబాలితో కలిసి ద్విచక్రవాహనంపై బాల సముద్రంనుండి భీమారం వైపువెళుతున్నారు. ఇదే సమయంలో హన్మకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంపత్‌రావు, పోలీసు సిబ్బందితో కలిసి గోపాలపూర్ రోడ్డు బేబి సైనిక్ స్కూల్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసిన కొరియర్ రమేష్ చందర్, వెనుకాల కూర్చున్న జబాలి ద్విచక్రవాహనాన్ని వెనక్కి తిప్పుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు ద్విచక్ర వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుండగానే వెనుక కూర్చున్న జబాలి కిందికి దిగి పారిపోయాడు. తక్షణమే వాహనం నడుపుతున్న రమేష్ చందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమేష్ చందర్ కరీంనగర్ జిల్లాలో డిగ్రీ చదువుకుంటున్న సమయంలో అదే జిల్లాలో పనిచేస్తున్న సీఓ శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. 1994లో రెవెన్యూశాఖలో సహాయ గణాంక అధికారిగా నియమితుడైన రమేష్ చందర్ మంథిని, కమలాపూర్, ఎల్కతూర్తి రెవెన్యూ కార్యాలయాల్లొ పనిచేస్తునే మావోయిస్టు పార్టీ సానుభూతి పరునిగా కొనసాగాడు. 2001లో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి రమేష్ అప్పటి మావో యిస్టు కార్యదర్శి రామకృష్ణ అలియాస్‌కు కొరియర్‌గా పనిచేసాడు. ఇటీవల రమేష్ చందర్, జబాలితో కలిసి చత్తీస్‌ఘ్ఢ్‌లోని పూజారికాంకేరి అడవుల్లో దామోదర్‌ను కలిసారు. దామోదర్ ఆదేశాల మేరకు మరోసారి సదరు కాంట్రాక్టర్ వద్ద పార్టీ చందా పేరు తో ఐదులక్షలు తీసుకుని, వాటిని దామోదర్ అంద జేసే క్రమంలోనే పోలీసులకు చిక్కారు.