క్రైమ్/లీగల్

అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, జూలై 16: పవిత్రమైన దేవాలయాల్లో, ఇండ్లలో దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకోవటంతో పాటు ఆరు లక్షల 85 వేల రూపాయాల రెండు వందల రూపాయాల విలవైన బంగారం, వెండి, ఇత్తడి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గార్ల మండలం కోట్యానాయక్ తండాకు చెందిన తేజావత్ చందు, ఆంగోతు రఘు, గుగులోతు బాబురావు, ధారావత్ శ్రీనులతో పాటు మరో ముగ్గురు గత కొంత కాలంగా ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని దేవాలయాల్లో, తళాలు వేసిన ఇళ్ళల్లో చొరబడి బంగారం వస్తువులు, బంగారం, వెండి దేవతమూర్తుల విగ్రహాలు, దేవతల గోపురాలు, దొంగిలించుకొని పోయేవారన్నారు. దోచిన బంగారం, వెండి వస్తువులను గార్లకు చెందిన కుకుడియా రాజు, కామేపల్లి మండలం గరుడపల్లికి చెందిన బట్టువెంకన్న, గార్లలో బంగారం వ్యాపారం చేస్తున్న రునావత్ సుధాకర్‌లకు విక్రయించే వారన్నారు. వీరిపై 26దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయని, ఖమ్మంలో 13, భద్రాది కొత్తగూడెంలో నాలుగు, మహబూబాబాద్ జిలాల్లో తొమ్మిది దోపిడి దొంగతనాల కేసులున్నాయని ఎస్పీ తెలిపారు. 7.70గ్రాముల బంగారం, 6.43కిలో వెండి, 20కిలోల ఇత్తడి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, సీసీ కెమెరాలు, వేలి ముద్రల ఆధారంగా వీరిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నారన్నారు. ఈ ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. విలేఖరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ గిరిధర్, డిఎస్పీ నరేష్‌కుమార్, గార్ల, బయ్యారం సీఐ వై.రమేష్, గార్ల ఎస్‌ఐ. పి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దోపిడి దొంగలను అదుపులోకి తీసుకోవటంలోను, చోరి సోత్తును రీకవరి చేసిన పోలీసు సిబ్బందికి ఎస్పీ రికార్డులను అందించారు.