క్రైమ్/లీగల్

చెలరేగిన క్రికెట్ బెట్టింగ్ ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, జూలై 16: కావలి పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. అడ్డుఅదుపు లేకుండా బెట్టింగ్ ముఠా చెలరేగిపోతోంది. బెట్టింగ్ నగదు కోసం ఏకంగా వ్యక్తులను అపహరించడం, నిర్బంధించి చిత్రహింసలకు గురిచేయడంలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారి అప్పుల ఊబిలో చిక్కుకుని యువకులు చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు సోమవారం పట్టణంలోని బాలకృష్ణారెడ్డినగర్‌కు చెందిన పీజీ విద్యార్థి సీహెచ్ కుమార్ ఉదంతమే ఉదాహరణ. పీజీ విద్యను అభ్యసిస్తున్నప్పటికీ క్రీడల పట్ల ఉన్న మక్కువతో ప్రతి క్రీడలోను పాల్గొని కుమార్ బెట్టింగ్ ముఠా సభ్యుల వలలో చిక్కుకున్నాడు. మొదట సరదాగా మొదలైన బెట్టింగ్ రోజులు గడిచే కొద్దీ వ్యసనంగా మారింది. తెలిసిన స్నేహితులు, బంధువుల వద్ద అప్పు చేసి మరీ బెట్టింగ్ చేయసాగాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుమార్‌ను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి అర్ధరాత్రి వదిలిపెట్టారు. అయితే ఇంటికి వచ్చిన కుమారుడిని చూసిన తండ్రి వెంకటరమణయ్య తీసుకెళ్లిన వ్యక్తులు కొట్టినట్లు గ్రహించాడు. అప్పులు చెల్లించాలని కుమార్ చెప్పగా, ఎవరికి ఇవ్వాలో చెప్తే తానే స్వయంగా వెళ్లి అప్పు తీరుస్తామనని చెప్పినట్లు ఆయన తెలిపారు. డబ్బు కోసం బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, స్థానికులు గమనించి కాపాడారు. వైద్యం కోసం 108 వాహనంలోఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

35 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ఆత్మకూరు, జూలై 16 : అక్రమంగా తరలిస్తున్న 35 బస్తాల రేషన్ బియ్యాన్ని ఆత్మకూరు పోలీసులు సోమవారం పట్టుకున్నారు. స్థానిక పాత సినిమా థియేటర్ సమీపంలో 25 కిలోల చొప్పున 35 బస్తాలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తక్షణం స్పందించి ఎస్‌ఐ నరేష్ సిబ్బందితో హుటాహుటిన దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. బియ్యం బస్తాలతో పాటు వాటిని తరలిస్తున్న ట్రక్ ఆటోను, రమణయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించి రమణయ్యపై కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కలిగి ఉన్నా, తరలించినా నేరమని, అట్టి వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.