క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల, జూలై 16 : ముందు వెళుతున్న లారీని వెనుక నుండి అజాగ్రత్తగా మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున మూడుగంటల సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే తెలంగాణ జిల్లా వికారాబాద్‌కు చెందిన తేమల మధుకర్‌రెడ్డి తన సొంత లారీని డ్రైవర్‌గా వెళుతుంటాడు. ఆదివారం చెన్నై రాష్ట్రంలోని అరకోణం నుండి రాజమండ్రికి ఎంఆర్‌ఎఫ్ టైర్ల లోడుతో మధుకర్‌రెడ్డి బయలుదేరారు. మార్గమధ్యలో సోమవారం తెల్లవారుజామున మేదరమెట్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై డైవర్షన్ కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెల వద్ద ముందు వెళుతున్న లారీ స్లో కాగా దానిని గమనించని మధుకర్‌రెడ్డి వెనుకనుండి తన లారీతో ముందు వెళుతున్న లారీని తన లారీతో ఆజాగ్రత్తగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లారీ కేబిన్ పూర్తిగా ధ్వంసం కాగా మధుకర్‌రెడ్డి కేబిన్‌లో తీవ్ర గాయాలపాలై ఇరుక్కుపోయాడు. ప్రమాదవార్త తెలుసుకున్న మేదరమెట్ల ఎస్‌ఐ వై పాండురంగారావు సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని క్యాబిన్ నుండి మధుకర్ బయటకు తెలిసి ఒంగోలు రిమ్స్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మధుకర్‌రెడ్డి (36) మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు 4, 2 సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. మేదరమెట్ల ఎస్‌ఐ వై పాండురంగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.