క్రైమ్/లీగల్

బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్ ఢీ.. ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జూలై 17:నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మంగళవారం ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో అదే గ్రామానికి చెందిన బొల్లి పెద్దనాగరాజు(52) దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పలుకూరు నుంచి గనుల వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను గ్రామ సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద తెల్లవారుజామున 5-30 గంటల సమయంలో ఢీకొంది. ఈ సంఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో నందవర్గం ఎస్‌ఐ ట్రాక్టర్ ఆధారాలు సేకరించారు. మండలంలోని యనకండ్లకు చెందిన నాగభూషణంరెడ్డి ట్రాక్టర్ నడుపుతూ బైక్‌ను ఢీకొన్నట్లు గుర్తించారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు వున్నారు. విషయం తెలిసిన వెంటనే నాగరాజు బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అనంతరం ఎస్‌ఐ శవాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.