క్రైమ్/లీగల్

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరి, జూలై 17: వరకట్న వేధింపులను తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వేలావడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పుదియమంగళం గ్రామానికి చెందిన పి.లక్ష్మి అలియాస్ ప్రేమ (24)కు నగరి మండలం వేలావడి గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాస్ అలియాస్ బాలాజీ (26)కు రెండేళ్లక్రితం వివాహమైంది. మంగళవారం పి.లక్ష్మి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. వరకట్న వేధింపుల కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని బాధితురాలి తల్లి లక్ష్మీ, తండ్రి గోవిందస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మునస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.