క్రైమ్/లీగల్

బాచుపల్లిలో ఫోర్జరీ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 20: ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి విక్రయానికి పెట్టిన ఇద్దరు వ్యక్తుల పై బాచుపల్లి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అదుపులో మాజీ కార్పొరేటర్ ఉన్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే బాచుపల్లి సర్వేనెంబర్ 140, 141లోని 32 ఎకరాల స్థలంపై సంవత్సరం క్రితం ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారు. పెద్దిరెడ్డి పేరున రిజిస్ట్రేషన్ పత్రాలను తయారు చేసిన వ్యక్తులు సూరారం కాలనీకి చెందిన మాజీ కార్పొరేటర్ సురేశ్ రెడ్డి, స్థానికుడు చంద్రాయాదవ్ కలిసి జీపీఏ చేసుకున్నట్టు పత్రాలను సృష్టించారు. బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి ఈ 32 ఎకరాల స్థలా న్ని పెట్టారు. అసలు విషయం తెలుసుకున్న కూకట్‌పల్లికి చెందిన యాజమాని దామోదర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల విలువ చేసే 32 ఎకరాల స్థలానికి ఫోర్జరీ పత్రాలు సృష్టించి సొమ్ము చేసుకోవాలని చూసిన మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ విషయంలో కొంతమంది బడా నేతలు ఉన్నట్టు అనుమానం. కేసు విషయంలో బాచుపల్లి సీఐ బాలకృష్ణారెడ్డిని ఫోన్‌లో వివరణ కోరగా సరైన సమాధానం చెప్పకుండా దాటవేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.