క్రైమ్/లీగల్

తక్కువ తూకాలతో ఉన్న ఎరువుల బస్తాలు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, జూలై 19: తపోవనంలోని సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్ ఎరువుల గోడౌన్‌ను నిఘా మరియు అమలు విభాగం అధికారి రామాంజినేయులు ఆదేశాల మేరకు గురువారం అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారులు ప్రతాప్, వ్యవసాయాధికారి శంకర్, లీగల్ మెట్రాలజీ అధికారి శంకర్ సంయుక్తంగా గోడౌన్‌ను తనిఖీ చేయగా వివిధ కంపెనీలకు చెందిన 50 కేజీల ఎరువుల బస్తాలు తూకం వేయగా, తక్కువ ఉన్నట్లు గుర్తించటం జరిగిందని ప్రాంతీయ నిఘా అమలు అధికారి రామాంజినేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు క్రిబ్‌కో సంస్థకు చెందిన యూరియా 50 కేజీల తూకం వేయగా 49.435, 49.353, 49.520 కేజీలు మాత్రమే వచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 16-20-0-13 ఎరువుల బస్తా 50 కేజీలగానూ 49.435, 49.560, 49.570 కేజీలు ఉన్నట్లు నిర్థారించటం జరిగిందన్నారు. క్రిబోకో కెంపెనీకి చెందిన ఎరువులు 132 ఎమ్‌టీ వాటి విలువ రూ.7,86,720 మొత్తం 165 ఎమ్‌టీ వాటి విలువ రూ.13,61,580లు సీజ్ చేసి లీగల్ మెట్రాలజీ అధికారులకు తదుపరి చర్యల కోసం అప్పగించడమైనదన్నారు. తూకంలో తక్కువ ఉన్నందున సదరు కంపెనీలపై చర్యలు తీసుకోబడునని ఆయన తెలిపారు.