క్రైమ్/లీగల్

పీఎసీ-2లో భక్తుల సొమ్ము, సెల్‌ఫోన్‌లు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 20: తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటుచేసిన పిలిగ్రిమ్స్ అమెటీస్ కాంప్లెక్స్-2లోని ఓ లాకర్‌లో వేసిన తాళాలు వేసినట్లుండగానే అందులో ఉన్న రూ. 30,000 విలువచేసే నగదు, సెల్‌ఫోన్‌లు మాయమైన సంఘటన శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన విజయభాస్కర్ శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. అద్దెగదులు దొరకకపోవడంతో టీటీడీ పీఏసీ-2లో లాకర్లు పొందారు. తలనీలాలు సమర్పించి కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చి తన వద్ద ఉన్న లాకర్ తాళాలతో లాకర్ తెరిచాడు. అందులో ఉండాల్సిన సెల్‌ఫోన్‌లు, నగదు లేకపోవడంతో అవాక్కయ్యాడు. అక్కడ ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. అలా జరగడానికి అవకాశం లేదంటూ సిబ్బంది భక్తులతో వాదనకు దిగారు. దీంతో విజయభాస్కర్ తిరుమల క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదుచేశారు. వేసిన తాళాలు వేసినట్లుండగానే లాకర్‌లో ఉన్న నగదు, సెల్‌ఫోన్‌లు మాయమవడం వెనుక అక్కడ ఉన్నవారు ఎవరో మారుతాళాలు తయారు చేసుకొని ఉంటారని భక్తులు అనుమానిస్తున్నారు.