క్రైమ్/లీగల్

డ్రైవరే దొంగ ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల,జూలై 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం కలిగిన ఏడుకోట్ల రూపాయలకు పైగా విలువైన సెల్‌ఫోన్లతో ఉన్న లారీ మాయమైన కేసులో ఓనర్ కమ్ డ్రైవర్ రంగనాథ్ దోషిగా పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాలోని శ్రీసిటి నుండి కలకత్తాకు రెడ్‌మి సెల్‌ఫోన్లు డెలివరికి బయలుదేరిన ఐషర్ కార్గో వాహనం గురువారం తెల్లవారుజామున మేదరమెట్ల గ్రామంలో అదృశ్యమైన సంఘటన పాఠకులకు విదితమే. డ్రైవర్ రంగనాథ్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న మేదరమెట్ల ఎస్‌ఐ వై పాండురంగారావు కేసు వివరాలను ఉన్నతాధికారులకు అందించి మేదరమెట్ల,కొరిశపాడు మండల పోలీసులను అప్రమత్తం చేశారు. గురువారం వేకువజాము నుండి పోలీసు సిబ్బంది జాతీయరహదారి, రాష్ట్రీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ల సిబ్బందికి లారీ నెంబరు తదితర వివరాలను అందించి ఆ టోల్‌గేట్ల ద్వారా లారీ పయనించలేదని నిర్థారించుకున్నారు. డ్రైవర్ మద్యం సేవించటం, లారీలు తాళాలు అతని వద్దనే ఉండటంతోపాటు, తాళాలు లేకుండా లారీని కదిలించే అవకాశం లేకుండా ఆధునీకరించే పద్ధతితో కార్గోలారీ రూపొంది ఉండటంతో పోలీసుల అనుమానం లారీడ్రైవర్‌పై పడింది. పోలీసులు తమదైన రీతిలో డ్రైవర్ రంగనాథ్‌ను విచారించగా నిజాలు బయటపడ్డా రు. డ్రైవరు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామసమీపంలోని చిల్లచెట్లచాటున లారీని దాచి, గురువారం సాయంత్రానికి రహస్యంగా పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన కేసుగా నమోదై 24గంటలు కూడా గడవక ముందే పోలీసులు కేసు పరిష్కరించటంతో కేసు సుఖాంతమైంది. ఈ కేసులో కేవలం డ్రైవర్ పాత్రేనా, ఇంకా ఎవరైనా పెద్దలు, స్థానికుల పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పోలీసుల స్వాధీనంలో ఉన్న లారీ వద్దకు ఎవరిని, ఆఖరుకు విలేఖర్లను సైతం అనుమతించకుండా లారీకి పర్జాలు కప్పి స్పెషల్ పోలీసులు రక్షణగా నియమించారు. విచారణ పూర్తయిన తరువాత కేసు పూర్వపరాలను తెలియచేస్తామని ఎస్‌ఐ పాండురంగారావు తెలిపారు.