క్రైమ్/లీగల్

ట్రక్కు ఆటో ప్రమాదంలో 10మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, జూలై 20: కూలి పనికి వెళుతున్న ఆటో కూలిపోయి 40 మంది వ్యవసాయ కూలీలు ప్రమాదం బారిన పడిన ఉదంతమిది. సేకరించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పంచేడు గ్రామ దళితవాడకు చెందిన 40 మంది వ్యవసాయ కూలీలు దగదర్తి మండలంలోని బాడుగులపాడు గ్రామంలో వేరుశనగ పీకేందుకు ఒక ట్రక్ ఆటోలో శుక్రవారం ఉదయం బయలుదేరారు. ఆ ఆటో పంచేడు గ్రామ శివారుల్లో ఉన్న మలుపు వద్ద చేరుకునే సమయంలో ఒక్కసారిగా ఆటో రెండు భాగాలుగా విడిపోయింది. దీంతో ట్రక్కులో ఉన్న కూలీలంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో 10 మంది కాళ్లు, చేతులు, తల, ముఖాలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో తువ్వర చిన్నమ్మ, నావూరు ప్రమీలమ్మల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా ఎనిమిది మంది కాగొల్లు రమణమ్మ, కాగొల్లు పెంచలయ్య, నున్నా రమణమ్మ, కాగొల్లు మంగమ్మ, తువ్వర వెంకట శేషమ్మ, కరేటి నవీన్, మరో ఇద్దరు స్థానిక ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. పూర్తిస్థాయిలో మరమ్మతులకు గురైన వాహనంలో ప్రయాణం చేయడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ట్రక్కు ట్రాలీలో అడుగు (్ఫ్లరింగ్) పూర్తిగా దెబ్బతిని ఉండటం వలన చెక్కలు పరచిఉండటం, అవి ప్రమాదం జరిగినప్పుడు అటు ఇటు తొలగిపోవడంతో ట్రక్కులో ప్రయాణం చేసే వారంతా ఒక్కసారిగా చెల్లాచెదురుగా పడిపోయారు. దీంతోపాటు ఇంజను భాగం ట్రాలీ నుంచి పూర్తిగా విడిపోయిన పరిస్థితి కలిగిందంటే ఎంత ప్రమాదకరస్థితిలో వాహనాలు తిరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రవాణాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.