క్రైమ్/లీగల్

క్వారీలో పేలుళ్లు.. ఇద్దరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సి.బెళగల్, జూలై 20:మండల పరిధిలోని పలుకుదొడ్ది గ్రామం సమీపంలో ఉన్న క్వారీలో శుక్రవారం పేలుళ్ల ధాటికి కంప్రెసర్ ట్రాక్టర్‌తో పాటు రాళ్లు మీద పడిన సంఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. పలుకుదొడ్డి గ్రామం సమీపంలోని క్రషర్ క్వారీలో ఉదయం కొండ పైన కాంప్రెసర్ సాయంతో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన మస్తాన్‌వలి(28), కోడుమూరుకు చెందిన బోయ చంద్రశేఖర్(40) అక్కడికక్కడే మృతిచెందారు. వారితో పాటు గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన చాకలి శ్రీరాములు, బోయ బాబు, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన రాజు తీవ్రంగా గాయపడగా అక్కడే ఉన్న తోటి కూలీలు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక మృతదేహాలను కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే సి.బెళగల్ ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే కర్నూలు డీఎస్పీ యుగంధర్‌బాబు, కోడుమూరు సీఐ శ్రీనివాసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. తహశీల్దార్ అన్వర్‌హుసేన్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద సంఘటనను పరిశీలించి, మృతుల కుటుంబాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే మణిగాంధీ
క్వారీలో ప్రమాదవశాత్తూ మరణించిన కుటుంబాలను ఆదుకుంటామని కోడుమూరు ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ హామీ ఇచ్చారు. అలాగే ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని క్వారీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ. 20లక్షలు ఇవ్వాలి
ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నడుపుతోన్న క్వారీ యాజమాన్యం వల్ల నేడు రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయని సీపీఎం నేత మోహన్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు తక్షణమే ఒకొక్కరికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే అనుమతి లేకుండా నడుపుతున్న క్వారీలను తక్షణమే రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరారు.