క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో వీఆర్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూలై 20: నంద్యాల పట్టణంలో శుక్రవారం ఉదయం 11గంటల్లో విశ్వనగర్‌లో కాపురం ఉంటున్న వీఆర్‌ఓ టి.జేజిబాబు రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన మహిళా రైతు సుబ్బలక్షమ్మ పొలానికి సంబంధించి పాసు బుక్కుల కోసం అర్జీ పెట్టుకోగా వీఆర్‌ఓ జేజిబాబు లంచం ఇవ్వాలని కోరడంతో విధిలేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను సంప్రదించారని, దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రంగంలోకి దిగారు. రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామ వీఆర్‌ఓ టి.జేజిబాబు నంద్యాలలోని తన స్వగృహంలో మహిళా రైతు తరపున మహానంది మండలం యు.బొల్లవరం గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తి వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి వీఆర్‌ఓను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు, ఇతర శాఖలకు చెందిన అధికారులు పంచనామా నిర్వహించి లంచంగా తీసుకున్న రూ.30 వేలను స్వాధీనం చేసుకోవడమేకాక కరెన్సీ నోట్లు తీసుకున్నట్లు లిట్మస్ పరీక్ష కూడా నిర్వహించారు. కాగా అక్రమార్జనకు ఆశపడిన వీఆర్‌ఓ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోవడంతో నంద్యాల పట్టణంతోపాటు రెవెన్యూ డివిజన్‌లోని పలు మండలాల్లోని వీఆర్‌ఓలు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమైనట్లు తెలిసింది.