క్రైమ్/లీగల్

ఆటో డ్రైవర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరాపురం, జూలై 20 : మండల పరిధిలోని హేమావతి గ్రామంలో ఆటో డ్రైవర్ వీరేష్ (24) శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దిలీప్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హేమావతికి చెందిన వీరేష్‌కు తల్లి శంకరమ్మ పొలాన్ని కుదువ పెట్టి ఫైనాన్స్‌లో ఆటోను కోనుగోలు చేసిచ్చింది. ఇటీవల వీరేష్ తాగుడుకు అలవాటు పడి ఫైనాన్స్‌కు కట్టాల్సిన బకాయిలు చెల్లించలేదు. దీంతో ఆటోను ఫైనాన్స్ వారు తీసుకెళ్లిపోయారు. ఈనేపథ్యంలో వీరేష్ తల్లి శంకరమ్మ అనారోగ్యంతో కర్నాటకకు చికిత్స నిర్వహించుకునేందుకు వెళ్లిది. ఆటో లేదన్న బాధతో వీరేష్ రెండు, మూడు రోజులుగా అతిగా మద్యం తాగాడు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.