క్రైమ్/లీగల్

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, జూలై 20: చదివిన ఉన్నత చదవులకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని, మనస్థాపం చెంది ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోశుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ కుమార రాజ తెలిపిన కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని సాతెల్లి బేస్ ప్రాంతానికి చెందిన జంగమాయిపేట విష్ణు(25), అనే యువకుడు,ప్రతీ రోజు మాదిరిగానే గురువారం రాత్రి కుటుంబ సభ్యులతోకలిసి బోజనం చేసి, తన గదిలోపడుకున్నాడన్నారు. తెల్లవారు జామున కుటుంబ సభ్యులు తలుపుతట్టిన లేవక పోవడంతో, అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు, చున్నీతోఉరివేసుకున్నట్లు తెలిపారు. విష్ణు బీఎ.బీఎడ్ పూర్తి చేసుకుని, ఉద్యోగ ప్రయత్నాలు చేసి, ఏ ఉధ్యోగం రాపోవడంతోచదివిన చదువుకు ఇక తనకు ఉద్యోగం రాదేమో అని మనస్థాపం చెంది, ఇంట్లో తన గదిలోఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వివరించారు. విష్ణు అందరితోకలగొలుపుగా చలాకీగా ఉండే వాడని, తోటి స్నేహితులు తెలిపారు. తండ్రి సాయిరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. ఇదిలా ఉండగా నియోజకవర్గ కాంగ్రెస్ నేత వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి విష్ణు పార్ధివ దేహంపై పూలదండవేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతికి గల కారణాలను వారికి అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ ఉద్యోగం రాద నే మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే మరో టీఆర్‌ఎస్ నేతలు పెద్దపట్లోళ్ల సిద్దార్థరెడ్డితోపాటు, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మంచిర్యాల విద్యాసాగర్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.