క్రైమ్/లీగల్

520 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు,జూలై 20: మండల కేంద్రంలో గత కొంత కాలంగా రైల్ మిల్లులే అడ్డగా ఏర్పచుకుని రేషన్ బియ్యం దందా కొనసాగిస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రం నుండి మదనాపురం మండలం నుండి జోగులాంబ గద్వాల జిల్లా నుండి వివిధ గ్రామాల నుండి రేషన్ బియ్యం ఆటోలు, బోలేరా వాహనాలు, ఓమిని వ్యాన్‌లలో మండల కేంద్రంలోని దస్తగిరి రైస్‌మిల్లు, 44వ జాతీయ రహదారి సమీపంలోని పక్కనే ఉన్న భగవతి రైస్ మిల్లు, బాలాజీ రైస్‌మిల్లులో బియ్యాన్ని చేరవేస్తూ అధికారుల కళ్ళు కప్పి దందాను కొనసాగిస్తున్నారు. వనపర్తి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రెమా రాజేశ్వరి అదేశాలతో స్పెషల్ పార్టీ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గద్వాల వైపు నుండి,కొత్తకోట వైపు నుండి ,వనపర్తి వైపు నుండి వచ్చే వాహనాలను తనిఖి చేయగా మండలంలోని ఆయా మిల్లులకు బియ్యాన్ని తరలిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారికి తోడుగా వనపర్తి రూరల్ ఎస్ ఐ రాఘవేందర్‌రెడ్డి, పెబ్బేరు ఎ ఎస్ ఐ జయన్న పోలీస్ సిబ్బందితో వారిని చాకాచక్యంతో పట్టుకొని సివిల్ సప్లయి అధికారులు డీఎస్ వో రేవతి, డిప్యూటి తహశీల్దార్‌నందకిశోర్, రాజేందర్‌లకు అప్పగించారు. మిల్లులో రేషన్ బియ్యాన్ని రిసైకిలింగ్ చేసేందుకు కుప్పలుగా పోయంచారు. రేషన్ బియ్యాన్ని తరలించేందుకు లారీలను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. వాహనాలన్నంటిని సీజ్ చేశారు. మిల్లు యాజమానులు, వాహానాదారులపై డిప్యూటి తహశీల్దార్ నందకిశోర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రిమినల్ కేసులను నమోదు చేసినట్లు ఎ ఎస్ ఐ జయన్న తెలిపారు.