క్రైమ్/లీగల్

దారి దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీన్‌పూర్, జూలై 21: సినిమా చూసి తిరిగి ఇంటికి వెళ్తున్న ఒక విదేశీ కరెన్సీ వర్తుకున్ని గుర్తు తెలియని అగంతకులు అటకాయించి నగదు, విదేశీ మారక ద్రవ్యాన్ని దోకెళ్లిన సంఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్‌గూడలో నివాసం ఉండే యాసీన్ భాషా నగరంలో విదేశీ కరెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం వారాంతం కావడంతో విధులు ముగించుకొని తన స్నేహితులతో కలిసి సినిమా చూసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో అమీన్‌పూర్ శివారులో యాసీన్ భాషా ప్రయాణిస్తున్న ఇన్నోవా ఏపీ 28 ఎవై 4689 కారును ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు మద్యలో నిలిపారు. దుండగులు కత్తులతో యాసీన్‌ను బెదిరించి వాహనంలో ఉన్న రూ.1.50 లక్షల నగదును, 1500 అమెరికన్ డాలర్లు, 4500 థైవాన్ మారకద్రవ్యాన్ని అపహరించుకొని వెళ్లారు. ఈ విషయమై బాధితుడు అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంరెడ్డి పేర్కొన్నారు. కాగా అర్ధరాత్రి దాటిన తరువాత యాసీన్ భాషా కారులో ఇంటికి వస్తున్నట్లు, ఆయన కారులో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లు దుండగులకు ఏలా తెలిసిందని, అదే కారును ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాసీన్ వాహనం ముందుగానే గుర్తించిన వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా, ఎవరైనా తెలిసిన వ్యక్తులే కావచ్చా అన్న అనుమానాలతో పరిశోధన చేస్తున్నట్లు తెలిసింది.