క్రైమ్/లీగల్

ఉద్యోగాల పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 21: సింగపూర్ రెస్టారెంటులో ఉద్యోగం ఇప్పిస్తానని భార్య భర్తలను మోసం చేసిన మరో జంటను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తన సోదరునికి సింగపూర్‌లో రెస్టారెంట్ ఉందని భార్య భర్తలు పని చేస్తే నెలకు రూ.25వేల యూఎస్ డాలర్లు వస్తాయని నమ్మించి రూ.7లక్షల 65వేలు కాజేసి భార్య భర్తలను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాల గూడకు చేందిన పడిగల శ్రుతి అలీయాస్ శ్రుతి నాయుడు అమె భర్త పందిరి నవీన్ కుమార్‌లు మణికొండలో నివాసముంటున్నారు. మిర్యాలగూడలో ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలో నష్టాలు రావడంతో ఉపాధి కోసం నగరానికి వచ్చి మణికొండలో నివాసముంటున్నారు. శ్రుతి ప్రైవేట్ టీచర్‌గాను భర్త నవీన్ కుమార్ ఆడ్వైటేజ్‌మెంట్ విభాగంలో పని చేస్తున్నారు. 2016లో భార్య భర్తలు ఉటీ వెళ్లినప్పుడు వీరికి పగడాల రమ్య అలీయాస్ రశ్మి దంపతులతో పరిచయం ఏర్పడింది. తరువాత రెండు జంటలు కలువక పోయినప్పటికి ఫేస్ బుక్‌లో మంచి చెడ్డ మాట్లాడుకునే వారు. 2017లోశ్రుతి విజిటింగ్ వీసాపై సింగపూర్ అబ్రాడ్ వెళ్లింది. ట్రాన్స్‌పోర్టు ఖర్చులకు ఒక్కక్కరికి రూ.4లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో రశ్మి రూ.7లక్షల 65వేలు వివిధ బ్యాకుంలో జమాచేసింది. కొన్ని రోజులకు నకిలీ వీసా తయారు చేసి దంపతుల చేతులో పెట్టారు. రశ్మి ఇంటికి వెళ్లి అన్‌లైన్‌లో పరిశీలిస్తే నకిలీ వీసాగా తేలడంతో భార్యభర్తలను నిలదీయడంతో ఎక్కడ మోసం జరిగింది కొన్ని రోజులు సమయం ఇవ్వలని కోరారు. దంపతుల ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ చేసుకుని పరారీ కావడంతో మోస పోయామని గ్రహించి పోలీసుకు ఫీర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు శ్రుతి, అమె భర్త నవీన్ కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను అరెస్టు చేసిన సైబర్ క్రైం సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ విజయ వర్ధన్, సిబ్బంది విజయ కుమార్, రాజా రమేష్‌లను సీపీ సజ్జనార్ అభినందించారు.