క్రైమ్/లీగల్

మేడిపల్లిలో తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూలై 21: బోడుప్పల్‌లో మేడిపల్లి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. తొలుత ప్రధాన వీధులన్నీ నిర్భందించి దేవేందర్ నగర్, ఇందిరానగర్, రాజీవ్ నగర్ కాలనీలను ఆధీనంలోకి తీసుకుని ఇంటింటికి వెళ్లి నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఇంటి యజమాని ఏమి చేస్తారు, ఎంత మంది నివసిస్తున్నారని పూర్తి సమాచారం సేకరించారు. ఇందులో ఒక అసజ్ అనే రౌడీ షీటర్‌తో పాటు 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని 18బైకులు, 5ఆటోలు, ఒక కారు, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అనుమతి లేకుండా మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఒక మహిళ ఉండటం గమనార్హం. మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వర్ రావు పర్యవేక్షణలో ఏసీపీ గోనె సందీప్, ఇన్‌స్పెక్టర్ అంజి రెడ్డి, దేవేందర్, ఎస్‌ఐలు, ఎస్‌ఓటీ, స్పెషల్ పోలీసుల బృందం పాల్గొన్నారు. అకస్మాత్తుగా ఇంటికి వెళ్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో తొలుత కాలనీ ప్రజలు భయపడ్డప్పటికీ తర్వాత తనిఖీలకు సహకరించారు.