క్రైమ్/లీగల్

ఎడాపెడా బోర్లు తవ్వకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: హోటళ్లు, సంస్థలు, కంపెనీలు ఎడాపెడా భూగర్భ జలాలను తోడడం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, కేంద్ర భూగర్భ జలాల అథారిటీ అనుమతి లేకుండా గొట్టపు బావుల తవ్వకానికి అననుమతి ఇవ్వవద్దని కేంద్రాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆదేశాలను ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్ జారీ చేశారు. 2010 మే 18వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీ కేంద్రపాలిత రాష్టప్రరిధిలో కేంద్ర భూగర్భ జలాల అథారిటీ అనుమతి లేకుండా గొట్టపుబావులు తవ్వరాదని ట్రిబ్యునల్ గుర్తు చేసింది. ఇష్టం వచ్చినట్లు సంస్థలు, హోటళ్లు భూగర్భ జలాలను తోడడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ఢిల్లీకి చెందిన శైలేష్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ పై ఆదేశాలు ఇచ్చింది. ఐదు నక్షత్రాల హోటళ్లు ఇష్టం వచ్చినట్లు భూగర్భ జలాలను తోడుతున్నాయని, ఈ చర్యలను అరికట్టాలని పిటిషనర్ కోరారు. కాగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీతో పాటు ఢిల్లీ జల బోర్డు, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు మూడు నక్షత్రాల హోటళ్లకు ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. కాగా గతంలో ట్రిబ్యునల్ ఒక స్టార్ హోటల్ ఇంకుడు గుంతలు తవ్వనందుకు రూ.7.5 లక్షల జరిమానాను విధించింది.