క్రైమ్/లీగల్

సంచిలో పిండంతో పోలీసు స్టేషన్‌కు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్, జూలై 22: ఇది యూపీకి చెందిన ఒక మహిళ హృదయవిదారకరమైన ఘటన. ఒక పోలీసు స్టేషన్‌కు అబార్షన్ తర్వాత పిండాన్ని సంచిలో పెట్టుకుని వచ్చింది. ఇది చూసి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే, తనను ఒక వ్యక్తి ఆరు నెలల క్రితం అత్యాచారం చేశాడని, దీని ఫలితంగా గర్భందాల్చినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన చేత బలవంతంగా గర్భ నిరోధక మాత్రలు మింగించారని, దీంతో అబార్షన్ అయిందని ఆమె పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. ఈ అమానవీయ ఘటన యుపీలోని ఆమ్రోహ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సంచిలో పిండం పెట్టుకుని రావడం ఘటన సంచలనానికి దారితీసింది. కాగా పోలీసుల కథనం మరోలా ఉంది. ఈ యువతి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని వారు తెలిపారు. కానీ పెళ్లి కాకుండానే యువతి గర్భం దాల్చడంతో ఆ యువకుడు గర్భ నిరోధక మాత్రలు ఇచ్చి అబార్షన్ చేయించాడని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో సంచిలో పిండం పెట్టుకుని పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన యువతి ఫిర్యాదు చేసింది నమ్మలా, లేక పోలీసులు చెబుతున్న అక్రమ సంబంధం స్టోరీని విశ్వసించాలా దర్యాప్తులో తేలనుంది.