క్రైమ్/లీగల్

రిటైర్డు ఉద్యోగుల వివాదాలు పరిష్కరించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హౌసింగ్ బోర్డు ఆస్తుల, అప్పుల విభజన విషయంలో రిటైర్డు ఉద్యోగులు బాధలు పడకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఏపి, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. రిటైర్డు ఉద్యోగులకు 2013 నాటి సవరించిన వేతనాలను వర్తింప చేసే విషయమై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. హౌసింగ్ బోర్డు రిటైర్డు ఉద్యోగులు బి కుమార స్వామి దాఖలు చేసిన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం విచారించింది. తాము వినతిపత్రాలను ప్రభుత్వాలకు సమర్పించామని పిటిషన్‌లో పేర్కొన్నారు. 4వారాల్లోగా నిర్ణయం తీసుకుని రిటైర్డు ఉద్యోగులకు తెలియచేయాలని హైకోర్టు ఆదేశించింది.