క్రైమ్/లీగల్

సూరంపాలెం రిజర్వాయర్‌లో దూకి విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగవరం./గోకవరం, జూలై 30: ఇంటిలో చదువుకోమంటున్నారని మనస్తాపానికి గురైన పదోతరగతి విద్యార్థిని సూరంపాలెం జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలు గంగవరం ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు. గోకవరం మండలానికి చెందిన చందనాల పూజిత (16) అనే బాలిక కామరాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. అయితే ఇంటిదగ్గర తల్లిదండ్రులు చదువుకోమని మందలించడంతో మనస్తాపానికి గురైన పూజిత సమీపంలో గల సూరంపాలెం రిజర్వాయర్ వైపు వెళ్లి రిజర్వాయర్‌లోకి దూకేసింది. బాలిక రిజర్వాయర్‌లోకి దూకడం గమనించిన కొంతమంది ఆ బాలికను రక్షించే ప్రయత్నం చేశారు. రిజర్వాయర్‌లోకి తాడును వేయగా ఆ తాడును పట్టుకునేందుకు పూజిత చేసిన ప్రయత్నం విఫలమైంది. నీటిలో పూర్తిగా మునిగిపోయి పూజిత మృతిచెందింది. జలాశయంలో గాలింపు చర్యలు నిర్వహించగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అడ్డతీగల ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేస్తున్న ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు. విషయం తెలుసుకున్న కొత్తపల్లి గ్రామస్థులు, సూరంపాలెం గ్రామస్థులు భారీగా సూరంపాలెం రిజర్వాయర్ దగ్గరకు చేరుకున్నారు.