క్రైమ్/లీగల్

పేరూరు వద్ద ఇంటి గోడ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 30: పేరూరులోని రాజవారి వీధిలో ఇంటి ప్రహరీగోడ నిర్మాణ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగి ఒక మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం ఉదయం 7గంటలకు జరిగింది. ఘర్షణకు పాల్పడ్డ వారంతా సమీప బంధువులే. బాధితురాలి కుమారుడు గోపి ఓ ప్రైవేట్ మెడికల్ సంస్థలో ఏరియా మేనేజర్‌గా పనిచేస్తూ తన తండ్రి సత్యనారాయణ రాజు, తల్లి ప్రమీలమ్మతో కలిసి పేరూరు రాజవారి వీధిలో నివాసం ఉంటున్నాడు. తన ఇంటికి సంబంధించి అనుసంధానంగా ఉన్న గోడను కట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో పక్కనే నివాసం ఉంటున్న టీటీడీ ఉద్యోగి మునిరాజ, ఆయన తమ్ముడు కృష్ణంరాజులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే సోమవారం ఉదయం గోడ కట్టే సమయంలో అభ్యంతరాలు చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదంతో మొదలై ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే మునిరాజ అక్కడే ఉన్న గోపి తల్లి ప్రమీలమ్మ (51) కుడి బుజంపై కత్తితో దాడిచేశాడు. దీంతో ప్రమీలమ్మ అక్కడే కుప్ప కూలిపోయింది. దీనిని గమనించిన గోపి భార్య సుజాత కేకలు వేయడంతో మిద్దిపై ఇంటిలో ఉన్న గోపి హుటాహుటిన వచ్చి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. రుయా వైద్యులు దీనిని ఎంఎల్‌సీ కేసు కింద ఎమ్మార్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ప్రమీలమ్మ రుయాలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుమారుడు గోపి మాట్లాడుతూ టీటీడీలో అటెండర్‌గా పనిచేస్తున్న మునిరాజ ఆయన కుటుంబ సభ్యులు గతంలో కూడా తమ ఇంటికి దారిలేకుండా గోడ కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పంచాయతీ చేయడానికి వచ్చిన గ్రామ పంచాయతీ వీఆర్వోపై కూడా దాడి చేశారని, దీనిపై ప్రస్తుతం కేసు కూడా నడుస్తోందన్నారు. తమకు న్యాయం చేయాలని, ఆ కుటుంబ వల్ల తమకు ప్రాణ భయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.