క్రైమ్/లీగల్

యాసిడ్ దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 30: తల్లీ కూతుళ్లపై యాసిడ్‌తో దాడి చేసిన కేసులో నిందితుడైన షేక్ సుభానికి యావజ్జీవ కారాగార శిక్ష (జీవిత ఖైదు), లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి ఎస్‌ఎస్‌ఎస్ జయరావు సోమవారం తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రాజుపేట మగ్గాల కాలనీలో నివాసం ఉంటున్న వివాహితుడైన సుభాని అదే ప్రాంతానికి చెందిన యువతి మహ్మద్ అజీద (26) పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేసేవాడు. తల్లిదండ్రులు మందలించటంతో కొంత కాలం వేధింపులు ఆపివేసినా పెళ్లి విషయమై పదే పదే వేధిస్తూ వెంటపడేవాడు. ఈ క్రమంలో 2014 మార్చి 28వతేదీన అజీదా తన తల్లి జరీనాతో కలిసి కాకాని వెళ్లి తిరిగి రాత్రి 10గంటలకు ఇంటికి వచ్చింది. ఎవరికి చెప్పి కాకాని వెళ్లారంటూ తల్లీకూతుళ్లపై నిందితుడు సుభాని యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తల్లి జరీనా చికిత్స పొందుతూ మృతి చెందగా అజీదా తీవ్రంగా గాయపడింది. దీనిపై ఇనగుదురు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ నిర్వహించిన న్యాయమూర్తి సాక్షాధారాలను పరిశీలించి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఐపీసీ 302 సెక్షన్ ఫ్రకారం పదేళ్ల జైలు, రూ.5వేలు జరిమానా, 307 సెక్షన్ కింద 10 సంవత్సరాల జైలు, రూ.10వేలు జరిమానా, 326-ఎ కింద 10 సంవత్సరాల జైలు, లక్ష రూపాయలు జరిమానాను న్యాయమూర్తి విధించారు. ఈ శిక్షలన్నింటినీ నిందితుడు ఏకకాలంలో అనుభవించాలని, లక్ష రూపాయలను బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. స్పెషల్ పీపీ లంకే వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్ నిర్వహించి 17 మంది సాక్షులను విచారించారు. నిందితుడికి శిక్ష పడటంలో సమర్ధవంతంగా వ్యవహరించిన పోలీసు అధికారులను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఒక ప్రకటనలో అభినందించారు.