క్రైమ్/లీగల్

హవాలా రాకెట్ గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నగరంలో హవాలా వ్యాపారం చేస్తున్న ముఠా వ్యవహారం గుట్టు రట్టయ్యింది. నగదుతో ఉండగా ముగ్గురిని ఒకే చోట అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు హవాలా లావాదేవీలను ఛేధించారు. వీరి నుంచి రూ.27.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు బల్వంత్‌సింగ్ మరికొందరు ఏజెంట్లు పరారీలో ఉన్నారు. మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో ఉండే దీవి మధుసూధన ప్రసాద్ (65), గౌలిగూడ చామన్‌కు చెందిన సోహన్‌లాల్ అలియాస్ సోను (22), కోటి గుజరాతీ గల్లీలోని కృష్ణా మొబైల్స్ యజమాని కిషోర్ కుమార్ (27)లను అదుపులోకి తీసుకున్నట్లు సిపి తెలిపారు. రాజస్ధాన్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన బల్వంత్‌సింగ్ నగరంలోని అశోక్‌బజార్‌లో నివశిస్తున్నాడు. గౌలిగూడ చామన్‌లో ఇతను తొలుత గాజుల వ్యాపారం చేపట్టాడు. ఆ వ్యాపారం క్రమేణా నష్టం రావడంతో హవాలా వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న కొందరు హవాలా ఏజెంట్లతో సంబంధాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో కమల్, ఢిల్లీకి చెందిన విక్రమ్, ముంబయికి చెందిన శంకర్‌లతో పరిచయాలు విస్తత్రం చేసుకున్నాడు. ఈ అక్రమ వ్యాపారం బాగా కలిసి రావడంతో కొందరు ఏజెంట్లను స్ధానికంగా నియమించుకుని గుజరాతీ గల్లీ వేదికగా హవాలా వ్యాపారం కొనసాగిస్తున్నాడు. 0.6 శాతం నుంచి 0.8 శాతం కమిషన్ పద్దతిలో హవాలా వ్యాపారం చేస్తున్నాడు. దేశంలో ఉన్న ఇతర మెట్రో నగరాల్లోని హవాలా ఏజెంట్లతోనూ సంబంధాలు పెట్టుకున్నాడు. నగదు సరఫరా చేసేందుకు వాట్సప్ ద్వారా యునిక్ కరెన్సీ సీరియల్ నెంబర్లు కలిగిన వంద, 50 నోట్లను కోడ్ గుర్తింపుగా చేసుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం గుజరాతీ గల్లీలోని కృష్ణా మొబైల్ దుకాణంపై దాడి చేశారు. అక్కడే ఉన్న నిందితులు మధుసూధన్ ప్రసాద్, కిషోర్‌కుమార్, సోషన్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా రూ.27.90 లక్షల నగదు దొరికింది. లెక్కల్లోకి రాని ఆదాయంగా పరిగణించి ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. నిందితులను సంబంధిత పోలీసు స్టేషన్లకు అప్పగించారు. ఈ నగదును ఢిల్లీకి పంపిస్తున్నట్లు నిందితుడు మధుసూధన్ తమ విచారణలో చెప్పినట్లు సిపి వెల్లడించారు. వీరంతా బల్వంత్ సింగ్ తరఫున పని చేస్తున్నట్లు తేలిందని, బల్వంత్ సహా మరికొందరు ఏజెంట్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి నగదుతో పాటకు ఏడు సెల్‌ఫోన్లు, నగదు లెక్కింపు యంత్రం ఒకటి, నకలీ ప్రెస్ ఐడి కార్డు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును టాస్క్ఫోర్స్ సెంట్రల్ జోన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు, ఎస్‌ఐ జి.తిమ్మప్ప దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.