క్రైమ్/లీగల్

అమ్మవారి చీర మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు ఒక భక్తురాలు ఆదివారం సమర్పించిన చీర కొద్ది క్షణాల్లోనే అదృశ్యం కావటం మిస్టరీగా మారింది. ఆషాఢ మాసం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఎస్ పద్మజ అనే భక్తురాలు కొందరు భక్తులతో కలిసి దుర్గగుడికి వచ్చి అమ్మవారికి ఆషాఢ మాసం సారె సమర్పించారు. మల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తి ముందు సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పద్మజ ఈ చీరను రూ. 18వేల వ్యయంతో స్వయంగా తయారు చేయించింది. పూజల అనంతరం చీరను దేవస్థానం కౌంటర్‌లో అప్పగించి రసీదు తీసుకునేందుకు చూడగా అప్పటికే చీర కనిపించలేదు. దీంతో పద్మజ విషయాన్ని ఆలయాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈవో ఎం పద్మ వెంటనే ఆలయానికి వచ్చి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆలయ సిబ్బంది సాయంత్రం 6గంటల వరకు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. అమ్మవారి ఉత్సవమూర్తి ముందు పెట్టిన చీర ఏమైందనే విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవరు చేతివాటం ప్రదర్శించారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.