క్రైమ్/లీగల్

ముగ్గురి సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం: ఓ కుమారుడి ఆగ్రహం ముగ్గురి సజీవ దహనానికి కారణమైంది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కంఠాత్మకూర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. పరాయి స్ర్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఓ తండ్రి ప్రాణాల మీదికి తెచ్చింది. తండ్రి తన తల్లిని, చెల్లిని, తనను పట్టించుకోవడం లేదని కొడుకు కొంతకాలంగా పగతో రగిలిపోయాడు. కుటుంబాన్ని పోషించాల్సిన తండ్రే పరాయి స్ర్తితో అక్రమ సంబంధం పెట్టుకొని, ఉన్న ఊర్లోనే కాపురం పెట్టడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. అంతేకాకుండా కుటుంబాన్ని కాదని ఉంపుడుగత్తెతో సహజీవనం సాగిస్తుండగా, తల్లి రోజు కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండాన్ని చూసి సహించలేకపోయాడు. తల్లి ఎంత కష్టపడినా వచ్చే అరకొర సంపాదనతో బతుకు భారంగా మారి, అప్పులతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడాన్ని తట్టుకోలేక పోయాడు. ప్రతీకారం తీర్చుకున్నాడు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన మామిడి పెద్ద లింగయ్య, రాజమ్మ దంపతులకు పెద్ద కుమారుడు కుమారస్వామి తన భార్య కౌసల్యతో కలిసి హన్మకొండ 41వ డివిజన్‌లోని ఇందిరానగర్‌లో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. వీరికి కుమారుడు కార్తీక్ (20), కుమార్తె(18) సంతానం. ప్లంబర్ పనిచేసే కుమారస్వామి తనవద్దకు పనికి వచ్చే పులుకుర్తి గ్రామానికి పోతరాజు సుమలత అనే స్ర్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారంపై భార్యా, పిల్లలు పలుమార్లు అతనిని నిలదీసారు. మానుకోవాలని సూచించారు. కానీ, అతను వినిపించుకోకుండా భార్యతో అనేక సార్లు గొడవపడడమేగాక, సుమలతను నేరుగా తన ఇంటికి తీసుకు రావడంతో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో స్వగ్రామం కంఠాత్మకూర్‌లో నివాసం ఉంటున్న కుమారస్వామి తన తల్లితండ్రుల ఇంటికి ఉంపుడుగత్తెతో కలిసి వెళ్లి అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. తమ కుటుంబాన్ని పట్టించుకోకుండా మరో మహిళతో జీవనం సాగించడంతో కొడుకు కార్తీక్ రగిలిపోయాడు. ఆదివారం ఉదయం నుండి రాత్రి పదిగంటల వరకు ఇందిరానగర్‌లో అనారోగ్యంతో మృతి చెందిన ఒక వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత, 10.30 గంటలకు క్యాన్‌లో పెట్రోల్ నింపుకుని కంఠాత్మకూర్‌లో తన తండ్రి నివసిస్తున్న తాతమ్మ ఇంటికి వెళ్లాడు. ఆసమయంలో తన తండ్రి కుమారస్వామి, ఉంపుడుగత్తె సుమలత, తాత పెద్ద లింగయ్య, నానమ్మ రాజమ్మ నిద్రిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కార్తీక్ ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లోని సిలిండర్ పేలింది. దీంతో కుమారస్వామి, సుమలత, రాజమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తాత మామిడి పెద్ద లింగయ్యను పక్కన ఉంటున్న చిన్న కొడుకు రవి స్థానికుల సహాయంతో బయటికి తీసుకు వచ్చారు. గాయాలపాలైన లింగయ్య ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్ద లింగయ్య చిన్న కూతురు బత్తుల యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురికి తరలించారు. ముగ్గురి సజీవ దహనానికి కారకుడైన కార్తీక్‌తోపాటు అతని తల్లి కౌసల్యను సోమవారం తెల్లవారు జామున హన్మకొండ ఇందిరానగర్‌లోని వారి ఇంటివద్ద పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు చెప్పారు.

చిత్రాలు..దగ్ధమైన ఇల్లు.. *మంటల్లో మాడి మసైన మృతదేహాలు